ఇథనాల్ పరిశ్రమకు అనుమతులన్నీ BRS ఇచ్చింది: మంత్రి సీతక్క
నిర్మల్(D) దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమకు ఆనాడు అనుమతులన్నీ BRS పార్టీ ఇచ్చిందని మంత్రి సీతక్క తెలిపారు. HYDలోని గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీతక్క మాట్లాడారు. ఆనాడు తాము నిరసనలు చేస్తే.. అప్పటి అధికార BRS మమ్మల్ని అపహాస్యం చేసిందన్నారు. ఆరోజు కనీసం గ్రామసభలు నిర్వహించకుండా ఏకపక్షంగా అనుమతులను సంస్థకు BRS ఇచ్చిందని చెప్పారు. సంపూర్ణమైన అనుమతులు BRS ఇచ్చిందని.. కేసీఆర్, కేటీఆర్ సంతకాలు ఉన్నాయన్నారు.