జానీ మాస్టర్‌కు బిగ్ షాక్
లేడీ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం కేసులో అరెస్టై బెయిల్ పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ కు ఊహించని షాక్ తగిలింది. ఆయనకు ప్రకటించిన నేషనల్ అవార్డును రద్దు చేశారు. జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు కావటంతో కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ అవార్డు అందుకోవడం కోసమే జానీ మాస్టర్ కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.