Sep 15, 2024, 03:09 IST/
ప్రధాని పదవి రేసులోకి వస్తే ప్రతిపక్ష నేత నాకు మద్దతిస్తానన్నారు: నితిన్ గడ్కరీ
Sep 15, 2024, 03:09 IST
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు.. ప్రధాని పదవి రేసులోకి వస్తే తనకు ప్రతిపక్ష నేత ఒకరు మద్దతు ఇస్తానన్నారని మంత్రి తెలిపారు. అయితే ఆ ఆఫర్ను తాను తిరస్కరించానని చెప్పారు. "మీరు నాకు ఎందుకు మద్దతు ఇవ్వాలి, నేను మీ మద్దతు ఎందుకు తీసుకోవాలని అడిగాను” అని గడ్కరీ అన్నారు. ప్రధానమంత్రి పదవి తన జీవిత ఆశయం కాదని గడ్కరీ తెలిపారు.