వైసీపీకి బిగ్ షాక్.. బాలినేని రాజీనామా
వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్కు పంపినట్లు తెలిపారు. కొద్ది రోజులుగా అధిష్టానంపై బాలినేని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.