రంపచోడవరం
ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థుల రోడ్ షో కు విశేష స్పందన
రాష్ట్ర శాసనమండలి సభ్యుడు అనంత సత్య ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో బుధవారం అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి, అరుకు పార్లమెంట్ అభ్యర్థి గుమ్మ తనూజరాణి ఎన్నికల ప్రచార రోడ్ షోకు విశేష స్పందన లభించింది. కార్యకర్తలు అభిమానులు ప్రజాప్రతినిధులతో సుమారు 5 వేల మందితో చింతూరు ఎర్రంపేట వీధి నుండి విఆర్ పురం వరకు రోడ్ షో నిర్వహించారు.