నేడు వారి ఖాతాల్లో డబ్బులు జమ
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వరదల కారణంగా నష్టపోయిన వారికి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే పరిహార ప్యాకేజీ ప్రకటించింది. నీట మునిగిన ఇంటికి సాయం అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే కొంత మందికి సాయం అందగా.. మరి కొంత మందికి అందలేదు. దీంతో సాయం అందని వారికి నేడు (సోమవారం) ప్రభుత్వం బ్యాంకుల్లో సాయం ప్రకటించిన నగదు జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 21,768 మంది ఖాతాల్లో దాదాపు రూ. 18 కోట్లు జమచేయనున్నారు.