నాలుగో రోజు ముగిసిన ఆట.. బంగ్లాదేశ్ 26/2
భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. మైదానం తడిగా ఉండటం వల్ల రెండు, మూడు రోజుల్లో ఆట సాధ్యం కాని విషయం తెలిసిందే. సోమవారం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 26/2 స్కోరుతో నిలిచి 26 పరుగుల వెనుకంజలో ఉంది. ఇక చివరి రోజు బంగ్లా చేసే పరుగులపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.