ఆన్లైన్లో భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల సేవలు నిలిపివేత
ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆన్లైన్లో భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల సేవలు నిలిపివేస్తున్నట్లు పట్టణ ప్రణాళికా విభాగం డైరెక్టర్ విద్యుల్లత తెలిపారు. డేటా మైగ్రేషన్, సర్వర్ మైగ్రేషన్‌లో భాగంగా వచ్చే నెల 4వ తేదీ వరకూ సేవలు అందుబాటులో ఉండవని ప్రకటించారు. ప్రస్తుతం భవన నిర్మాణాలు, లేఅవుట్లకు అనుమతులను డీపీఎంఎస్ వెబ్సైట్ ద్వారా జారీ చేస్తున్నామని స్పష్టం చేశారు.