ఆచంట
వేల్పూరు 3లో ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం
తణుకు మండలం వేల్పూరు 3 గ్రామంలో శనివారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం నిర్వహించబడ్డది. డాక్టర్ సాయిభవాని ఆధ్వర్యంలో, గ్రామంలో పర్యటించిన వైద్య బృందం సభ్యులు పలువురికి మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ వి దుర్గ కుమారి, డి.ఇ.ఓ సాయిరాం వెంకటేష్, ఎం ఎల్ హెచ్ పీ ధనుజ, ఎంపీ హెచ్ ఏ ఆనంద్, ఏఎన్ ఎం అనిత, పైలట్ రాంబాబు, ఆశ సిబ్బంది, అంగన్వాడీలు పాల్గొన్నారు.