ఉంగుటూరు
ఆసుపత్రికి వెళ్లి పెన్షన్ అందజేత
ఉంగుటూరు మండలం నాచుగుంట గ్రామానికి చెందిన పెద్ది సుబ్బారావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాచుగుంట గ్రామపంచాయతీ కార్యదర్శి నీలం శివప్రసాద్ శుక్రవారం ఏలూరు ఆశ్రమ హాస్పటల్లో చికిత్స పొందుతున్న సుబ్బారావుకు పెన్షన్ అందజేశారు. ఆరోగ్యంతో బాధపడుతున్న పెన్షన్ దారుడు ఎక్కడున్నా వెళ్లి పెన్షన్ అందజేస్తున్నట్లు కార్యదర్శి ప్రసాద్ తెలిపారు.