కాకినాడ సిటీ
కాకినాడ: ప్రజా సమస్యలను పరిష్కరించాలి
ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో(పీజీ ఆర్ఎస్) అందిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కారించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఇతర అధికారులతో కలిసి హాజరై, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.