అమలాపురం
అమలాపురం: సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన అధికారులు
స్వర్ణాంధ్ర-2047 విజన్ కార్యాచరణ ప్రణాళికలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కోనసీమ జిల్లా అధికార యంత్రాంగంతో చర్చలు జరిపారు. ఆయన గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు అమలాపురంలోని కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులు హాజరయ్యారు. స్వర్ణాంధ్ర-2047 కార్యాచరణ కోసం జిల్లాలో చేపట్టవలసిన వివిధ రకాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అధికారులకు ఆయన సూచనలు చేశారు.