సజ్జల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట
AP: గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డికి హైకోర్టు భారీ ఊరట కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. జగన్ సర్కార్ హయాంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల నిందితుడిగా ఉన్నారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా.. ఆయనను అరెస్టు చేయకుండా కోర్టు పోలీసులకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.