విజయవాడ సెంట్రల్
ఉమ్మడి కృష్ణా జిల్లాకు వర్ష సూచన
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో మంగళవారం వర్షాలు కురుస్తాయని APSDMA ప్రకటించింది. ఇది రాబోయే 7 రోజుల్లో తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రేపు ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప.గో, ఎన్టీఆర్ ,పల్నాడు. ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.