Top 10 viral news 🔥
నేడు వారికి రెండు నెలల పెన్షన్
ఏపీలో మంగళవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. నేడు గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా వాసులకు రెండు నెలల పింఛన్ సొమ్ము అందిస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ మూడు జిల్లాల్లోని 2,658 మందికి పెన్షన్లు అందలేదు. అందుకే వారికి 2 నెలల పెన్షన్ ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. మరోవైపు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ సొమ్ము అందించనున్నారు.