గ్రామ సచివాలయాలకు కీలక ఆదేశాలు..!
ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వార్డు, సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. వార్డు, గ్రామ సచివాలయాలతో పాటుగా మీ సేవా కేంద్రాల ద్వారా జారీ చేసే సర్టిఫికెట్లు.. ఇతర ప్రభుత్వ పత్రాలపైన ఏ రాజకీయ నేత.. పథకాల లోగోలు లేకుండా జారీ చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే జారీ చేసి ఉంటే వాటిని వెనక్కు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇక నుంచి ఎవరైనా గతంలో లాగానే నేతల ఫొటోలతో సర్టిఫికెట్లు జారీ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.