Top 10 viral news 🔥
స్టార్ నటుడికి నిరసన సెగ
కోలీవుడ్ స్టార్ నటుడు కమల్‌హాసన్ నిర్మించిన అమరన్ చిత్రంలో ముస్లింలను ఉగ్రవాదులుగా చూపెట్టడంపై ముస్లిం సంఘాలు కన్నెర్రజేశాయి. సినిమాలో అలాంటి అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని ఎస్డీపీఐ(SDPI) డిమాండ్ చేసింది. ఈ క్రమంలో చెన్నైలోని కమల్ నివాసం వద్ద పలు ముస్లిం సంఘాలు ధర్నా చేపట్టాయి. కమల్‌హాసన్ దిష్టిబొమ్మ దహనం చేయడంతోపాటు.. తక్షణమే ఆయా సన్నివేశాలను తీసేయాలంటూ నినాదాలు చేశారు.