తిరుపతిలో 2.5 కేజీల గంజాయి స్వాధీనం, ముఠా అరెస్ట్ (వీడియో)
తిరుపతిలో గంజాయి కలకలం రేపుతోంది. తిరుపతి, రేణిగుంటలో యువతకు గంజాయిని విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గంజాయి అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2.5 కేజీల గంజాయి, రూ.50 వేలను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా గంజాయి దందా చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.