కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం వినూత్న నిరసన చేపట్టిన వైఎస్ షర్మిల (వీడియో)
AP: కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వినూత్న నిరసన చేపట్టారు. కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బుధవారం కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కొబ్బరి కాయ కొట్టి నిరసన తెలిపారు. 'కడప ఉక్కు ఆంధ్రుల హక్కు' అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కడప స్టీల్ అంటే కొబ్బరి కాయలు కొట్టే ప్రాజెక్టు అని దుయ్యబట్టారు. పేదల కోసం, కడప ప్రాంత అభివృద్ధికి వైఎస్ఆర్ చిత్తశుద్ధితో తీసుకొచ్చిందే ఈ ఫ్యాక్టరీ అని గుర్తుచేశారు.