Top 10 viral news 🔥
DSC అభ్యర్థులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
ఏపీలో 16,347 మెగా DSC పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గిరిజన అభ్యర్థులకు ఉచిత DSC శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆరు ఐటీడీఏల్లో, గిరిజనేతరుల ప్రాంతాల్లో రెండు లేదా మూడు సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఒక్కో కేంద్రంలో 150 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. మూడు నెలలపాటు సాగే ఈ శిక్షణకు ఒక్కో అభ్యర్థికి రూ.25 వేల వరకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది.