నెల్లూరు సిటీ
నెల్లూరులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికీ తీవ్ర గాయాలు
నెల్లూరు జాతీయ రహదారి సుందరయ్య కాలనీ సెంటర్లో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్ పై రోడ్డు క్రాస్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన వైద్య సహాయం కోసం ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.