మార్కెట్ల ఆదాయం పెంచాలి: మంత్రి తుమ్మల
తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్ల ఆధీనంలో ఉన్న గోదాముల నిర్వహణ, ఖాళీ స్థలాలను వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే విధంగా చేసి మార్కెట్ల ఆదాయం పెంచాలని అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సూచించారు. ప్రాథమిక సహకార సంఘాలకు (PACS) సంబంధించి రైతులకు మరింత సులభతరంగా, సమర్థవంతంగా సేవలు అందేలా రీ-ఆర్గనైజేషన్ చేసి, అవసరమున్న చోట కొత్త శాఖలు ఏర్పాటు చేయాలన్నారు. సంఘాల పరిపుష్టికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.