గాజువాక
పెదగంట్యాడ: హామీల అమలుపై 18న ధర్నా
ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18న గాజువాక నియోజకవర్గం పరిధిలోగల సచివాలయాల వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి కె సత్యనారాయణ తెలిపారు. సోమవారం గంగవరంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు.