పెద్దపల్లి
ఏఈఓలపై డిసిఎస్ సర్వే ఒత్తిడి పెంచొద్దు..
పెద్దపల్లి మండలంలోని రైతు వేదికల్లో మంగళవారం ఏఈఓలు నల్ల బ్యాడ్జిలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహణ కష్టతరమని నినదించారు. ఏఈఓలపై డిసిఎస్ సర్వే చేయాలని ఒత్తిడి తేవడానికి నిరసనగా రాష్ట్ర ఐకాస పిలుపు మేరకు ఏఈఓలు నల్ల బ్యాడ్జిలు ధరించి రైతునేస్తం వీడియో సమావేశానికి హాజరయ్యారు. నిరసనలో ఏఈఓలు శిరీష, వినయ్, పూర్ణచందర్, కల్పన, సువర్చల పాల్గొన్నారు.