హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో హైడ్రా కూల్చివేతలు
హైదరాబాద్లో మళ్లీ హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. తాజాగా GHMC అధికారులతో కలిసి హైడ్రా అధికారులు ఫిల్మ్ నగర్లో ఆక్రమణలను తొలగించారు. ఫిల్మ్ నగర్లో రోడ్డు ఆక్రమించి నిర్మించిన కట్టడంపై స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. అక్రమంగా నిర్మించిన రేకుల షెడ్డుతో పాటు ఆ పక్కనే ఉన్న ఇంటి ప్రహరీని కూల్చి వేశారు.