జూదంలో భార్యను పందెం కాసిన భర్త.. లైంగిక వేధింపులకు ఫ్రెండ్స్‌కు అనుమతి
యూపీలోని రాంపూర్ షహబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి జూదానికి బానిస అయ్యాడు. పేకాటలో 7 ఎకరాల భూమిని పోగొట్టుకున్నాడు. చివరికి భార్య, ముగ్గురు పిల్లలను సైతం పందెం కాశాడు. ఓడిపోవడంతో తన భార్యపై లైంగిక వేధింపులు చేసుకోవచ్చని ఫ్రెండ్స్‌కు అనుమతి ఇచ్చాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ విద్యాసాగర్ మిశ్రా తెలిపారు.