వైద్యురాలి కేసులో కీలక మలుపు.. మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అరెస్ట్
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశంలో సంచలనం సృష్టించింది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ శనివారం సాయంత్రం కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా ఏరియా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అభిజిత్ మండల్‌లను అరెస్టు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం చేయడంతో పాటు సాక్ష్యాలను మాయం చేశారనే అభియోగాలను వారిద్దరిపై నమోదు చేసింది.