వైసీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు
AP:వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఇసాక్ బాషాకు భారీ షాక్ తగిలింది. ఆయనపై నంద్యాల జిల్లా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం కేసు నమోదైంది. కోర్టు అదేశాల మేరకు ఎమ్మెల్సీ ఇషాక్ తో పాటు మరో నలుగురి పై పోలీసులు కేసు నమోదు చేశారు. మసీద్ నిధుల అవకతవకలు పాల్పడినట్లు, అక్రమ కట్టడంపై బాదితుడు సలాం కోర్టును ఆశ్రయించడంతో.. కోర్టు అదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.