నందికొట్కూరు
పోతులపాడులో పొలం పిలుస్తుంది కార్యక్రమం
జూపాడు బంగ్లా మండలం పరిధిలోని బన్నూరు, పోతులపాడు గ్రామాలలో మండల వ్యవసాయాధికారి బి. కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. పంటలను పరిశీలించి వివిధ పంటలపైనా రైతులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. రైతు సేవ కేంద్రం నందు రైతులను సమావేశ పరిచి రైతులకు పంటలపైనా అవగాహనా కార్యక్రమం మరియు వివిధ పథకాల గురించి వివరించారు. గ్రామా వ్యవసాయ సహాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.