మాడుగుల
దేవరపల్లి మండలంలో ఎంపి, ఎమ్మెల్యే పర్యటన
మాడుగుల నియోజకవర్గ పరిధిలో గల దేవరపల్లి మండలంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఆదివారం అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వివిధ గ్రామాల్లో పర్యటించి సుమారు కోటి రూపాయలు విలువైన ఎన్ఆర్ఈజీఎస్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ నిధులను పక్కదారి పట్టించిందని విమర్శించారు.