త్వరలోనే మార్కెట్లోకి రానున్న 'హోండా యాక్టీవా ఈవీ'
హోండా యాక్టివా పేరుకు ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉంది. అందుకే 'హోండా యాక్టివా ఈవీ' పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి హోండా తన టెక్నాలజీతో పూర్తి చేసి యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 2025లో భారత్‌లో విడుదల చేయనుందని సమాచారం. తమ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శనకు వస్తుందని భావిస్తున్నట్టుగా హోండా టూ-వీలర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ చెప్పారు.