పిఠాపురం
పిఠాపురం: భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలి
భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని గొల్లప్రోలు మండలం చేబ్రోలులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటి ముందు గురువారం భవన నిర్మాణ కార్మికులు నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తామని చెప్పడం జరిగిందని నేటికీ అందుబాటులోకి తీసుకు రాకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. తమ సమస్యలపై కూడిన వినతిపత్రాన్ని పవన్ కార్యాలయ సిబ్బందికి అందజేశారు.