Top 10 viral news 🔥
మెట్రో నుంచి యువతిని బయటకు తోసేసిన మహిళ (వీడియో)
ఢిల్లీ మెట్రోలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని మరో మహిళ మెట్రో నుంచి బయటకు తోసేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. తొలుత ఓ మహిళ, యువతి మధ్య వివాదం చెలరేగడంతో అక్కడ గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మహిళ యువతిని బయటకు గెంటేసింది. కాగా, దీనిపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.