నరసాపురం(ప.గో)
ఆగిరిపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలను తమ సొంత పిల్లలుగా ఆదరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం ఆగిరిపల్లిలోని నెం. 5 అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్రంలోని పిల్లలకు అందిస్తున్న పౌష్టిక ఆహార వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పిల్లలు భుజించే భోజనాన్ని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంద్వారా వారికి నేర్పిస్తున్న విద్యాభోదనలు, గేయాలను ఆలకించారు.