డోన్
డోన్: మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం
డోన్ మున్సిపల్ ఆఫీస్ నందు సామాజిక కార్యకర్త పి.మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.ప్రసాద్ గౌడ్ అధ్యక్షతన మహాత్మ జ్యోతిరావు పూలే వర్థంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి ఈ రఘు, ఏ ఈ. సురేష్, ఆర్ ఐ మోహన్, మేనేజర్ ఆరిఫ్, రెవెన్యూ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, స్వామిరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.