డోన్
ప్యాపిలి పోస్టాఫీసు భవనానికి భూమి పూజ
ప్యాపిలి పట్టణంలో పోస్టాఫీసు భవన నిర్మాణానికి ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి శనివారం భూమి పూజ చేశారు. రూ.40 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నామని, ఈవ్యవస్థ ద్వారా ప్రజలకు మంచి చేకూరుతుందని వారు అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరహరి గోడ నిర్మించాలని, ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో కర్నూల్ డివిజన్ జనరల్ పోస్ట్ మాస్టర్ ఉపేంద్ర, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.