పాయకరావుపేట
వినాయకుని ఊరేగింపులో అందరినీ ఆకట్టుకున్న బల్ల వేషాలు
వినాయకుని ముగింపు ఉత్సవాల్లో భాగంగా అందరూ డీజే సాంగ్స్ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే మేజర్ పంచాయతీ కోటవురట్లలో శ్రీ వరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో బాల వినాయకుని నిమజ్జన కార్యక్రమం శనివారం రాత్రి జరిపారు. దీనిలో భాగంగా కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన పూర్వకాలం నాటి బల్ల వేషాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వినాయకుడు, లవకుశలు, రాముడు వేషధారణలతో ట్రాక్టర్ ఫై ఊరేగింపు సంబరం జరగడం అందర్నీ ఆకట్టుకున్నాయి.