నరసాపురం(ప.గో)
నరసాపురం హోటళ్లపై మున్సిపల్ కమిషనర్ తనిఖీ
పగో జిల్లా నరసాపురం పంజా సెంటర్లోని హోటళ్లను మున్సిపల్ కమిషనర్ ఎం. అంజయ్య తన సిబ్బందితో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. కమిషనర్ హోటల్ నిర్వాహకులను పరిశుభ్రత పాటించాలని హెచ్చరిస్తూ, నిర్లక్ష్యానికి జరిమానాలు విధించి హోటల్స్ సీజ్ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సచివాలయ సిబంది పాల్గొన్నారు.