

మామను దారుణంగా కొట్టిన కోడలు (వీడియో)
యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బిజ్నోర్ కొత్వాలి నగరంలోని స్వాహేది గ్రామంలో ఒక కోడలు మామగారిని కర్రలతో దారుణంగా కొట్టింది. భూమిపై దురాశతో చిన్న కొడుకు, కోడలు కలిసి తనని దారుణంగా కొట్టారని, భూమి లాక్కోవాలని చూస్తున్నారని బాధితుడు స్థానిక పీఎస్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.