నల్గొండ జిల్లా - Nalgonda

వీడియోలు


తెలంగాణ
Top 10 viral news 🔥
ఆండ్రోమాక్స్ ను ప్రారంభించిన ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్
Jun 15, 2024, 10:06 IST/

ఆండ్రోమాక్స్ ను ప్రారంభించిన ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్

Jun 15, 2024, 10:06 IST
అంతర్జాతీయ ఫాదర్స్ డే సందర్భంగా, దక్షిణ భారతదేశంలోని అత్యుత్తమ ఐవిఎఫ్ చైన్‌లలో ఒకటైన ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్, పెరుగుతున్న పురుషుల వంధ్యత్వ సమస్యకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడానికి పూర్తిగా అంకితం చేసిన 'ఆండ్రోమ్యాక్స్'ని ప్రారంభించినట్లు ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ యజమాన్యం వెల్లడించింది. ప్రఖ్యాత భారతీయ నటి సంగీత సమక్షంలో హైదరాబాద్‌లో వైభవంగా ఈ వేడుక జరిగింది. అధునాతన సాంకేతికతలు మరియు నైపుణ్యంతో కూడిన సంరక్షణను 'ఆండ్రోమ్యాక్స్' మిళితం చేయడంతో పాటుగా ఒకే చోట పురుషుల వంధ్యత్వానికి సంబంధించిన సమగ్ర పరిష్కారాలను అందిస్తుందన్నారు. అత్యున్నత అర్హత కలిగిన ఐవిఎఫ్ నిపుణులు, శిక్షణ పొందిన ఎంబ్రియాలజిస్ట్‌లు మరియు ఆండ్రాలజిస్ట్‌లతో కూడిన బృందం మల్టీడిసిప్లినరీ విధానంతో పురుష సంతానోత్పత్తి యొక్క సూక్ష్మ అవసరాలను సైతం తీర్చడమే 'ఆండ్రోమ్యాక్స్' లక్ష్యమని యాజమాన్యం వెల్లడించారు. ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సీఈఓ వినేష్ గాధియా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పురుష సంతానోత్పత్తి సమస్యలు పెరుగుతున్నప్పటికీ, ఈ సవాలుతో కూడిన ప్రయాణంలో, పురుష వంధ్యత్వానికి అవసరమైన శ్రద్ధ చూపటం లేదని అర్థం చేసుకున్నామన్నారు. ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి బుడి మాట్లాడుతూ ఆండ్రోమ్యాక్స్ ప్రారంభించడం అనేది పురుషుల సంతానోత్పత్తి సవాళ్లను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని మా సేవా ఆఫర్‌లను మెరుగుపరచడంలో కీలకమైన ముందడుగు అని గుర్తు చేశారు. అత్యున్నత స్టాయి వైద్య నైపుణ్యం, అత్యాధునిక సాంకేతికత మరియు దయతో కూడిన సంరక్షణ విధానంను ఇది మిళితం చేస్తుందన్నారు.