పెనుగొండ
పెనుకొండ: ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి: మంత్రి
ప్రజా వేదికలో వచ్చే ప్రజల సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు మంత్రి సవితమ్మ ఆదేశించారు. సోమవారం పెనుకొండ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం భువన విజయం భవనంలో సమస్యల పరిష్కారం మంత్రి ప్రజా వేదిక నిర్వహించారు. ఈ సందర్బంగా నియోజకవర్గం నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి మంత్రి అర్జీలను స్వీకరించారు. అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.