గన్నవరం
గన్నవరం: మా బాధను అర్థం చేసుకోండి
మా బాధను అర్థం చేసుకొని న్యాయం చేయమని చేతులు జోడించి వేడుకున్న ఘటన ఆదివారం రాత్రి మాదలవారిగూడెంలో చోటుచేసుకుంది. స్థానిక ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఈతకు వెళ్లిన సమయంలో వారిలో ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడగా మరో ఇద్దరు విద్యార్థుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఈ విషయం తెలుసుకున్న మృతుల బంధువులు కళాశాల ప్రాంగణం వద్దకు చేరుకొని మా బాధను అర్థం చేసుకోండి అని వేడుకుంటున్నారు.