సిరిసిల్ల
ముస్తాబాద్ మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. గత పది యేండ్ల కాలంలో ఎన్నడు లేని విధంగా ప్రజా ఆరోగ్యంపై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుందని అన్నారు. నేడు దాదాపు 45చెక్కుల పంపిణీ చేసి పేద మధ్య తరగతి ప్రజలకు దాదాపు 22 లక్షల రూపాయల వరకు లబ్ధి చేకూరిందన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జెల రాజు, కాంగ్రెస్ నేతలున్నారు.