నడిరోడ్డుపై ఏనుగుల హల్చల్.. వీడియో వైరల్
నడిరోడ్డుపై రెండు ఏనుగులు హల్చల్ చేశాయి. ఈ ఘటన తాజాగా కర్ణాటకలోని మైసూరులో జరిగింది. మైసూరు ప్యాలెస్ ప్రధాన ద్వారం జయమార్తాండ ద్వారా రెండు ఏనుగులు బయటకు వచ్చాయి. వాటిలో ఒక ఏనుగు మరో ఏనుగును తరమడం కనిపించింది. అయితే, అదృష్టవశాత్తూ మావటి తన ఏనుగును అదుపులోకి తీసుకురావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఏనుగులకు రాత్రి ఆహారం పెట్టే సమయంలో రెండు ఏనుగులు ఒకే చోటికి రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.