మచిలీపట్నం
మచిలీపట్నం: ఒప్పంద జీవోలను తక్షణం అమలు చేయాలి
ఒప్పంద జీవోలను అమలు చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ధనశ్రీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆశ కార్యకర్తలు సోమవారం మచిలీపట్నంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు.