విజయవాడ ఈస్ట్
విజయవాడ: బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకున్నట్లు రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గానరేశ్ తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ నుంచి అనకాపల్లి నెల్లూరు జిల్లాల వరకు కొత్త కమిటీలు నియమించినట్లు ఆయన తెలిపారు. జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, యూత్ ప్రెసిడెంట్లు నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు.