తల్లి మృతదేహంతో మూడు నెలలుగా ఇంట్లోనే ఉంటున్న కొడుకు
అస్సాంలోని గౌహతిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జ్యోతికూచి ఏరియాలో తల్లి మృతదేహంతో ఓ వ్యక్తి ఏకంగా మూడు నెలలు ఇంట్లోనే నివసించాడు. మృతురాలిని పూర్ణిమా దేవి (75)గా పోలీసులు గుర్తించారు. ఆమె మూడు నెలల క్రితం మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆమె తన కుమారుడు జైదీప్ దేవ్‌తో కలిసి గత కొన్ని ఏళ్లుగా ఈ ఇంట్లో నివసిస్తూ ఉంది. జైదీప్ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని స్థానికులు తెలిపారు. పోలీసులు జైదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు.