అరకు వ్యాలీ
హుకుంపేట: సంతారిలో మంచినీటి సమస్య పరిష్కరించాలని ఆందోళన
హుకుంపేట మండలంలోని సంతారిలో మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు ఖాళీబిందెలతో మంగళవారం నిరసనలు చేపట్టారు. గ్రామస్తులు నూకరాజు సత్యనారాయణ మాట్లాడుతూ.. గ్రామంలో సోలార్ మోటర్ ద్వారా ఏర్పాటు చేసిన కొళాయిల్లో వారం రోజులుగా మంచినీటి రాక సమీపంలోని నేలబావిలో ఉన్న కలుషిత నీటి ద్వారా తమ అవసరాలకు వినియోగించుకొని పలు రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. ఈ సమస్యపై పంచాయితీ పాలకులు అధికారులు స్పందించాలన్నారు.