Top 10 viral news 🔥
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 10 మందికి గాయాలు
మధ్యప్రదేశ్ జబల్పుర్లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. సిహోర-మజ్గావ్ రహదారిపై ట్రక్కు, లగేజ్ ఆటో ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.