కామారెడ్డి
రోడ్డు ప్రమాదంలో ఉపాధిహామీ టెక్నీకల్ అసిస్టెంట్ మృతి
మాచారెడ్డి మండలం భవానిపేట మూలమలుపు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధి హామీలో పని చేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ మృతి చెందారు. మాచారెడ్డి మండల ఉపాధి హామీ లో టెక్నికల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న జైల్ సింగ్ కామారెడ్డి నుంచి మాచారెడ్డికి వస్తుండగా మట్టి రవాణా చేస్తున్న టిప్పర్ ఢీ కొట్టింది. హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.